హనుమకొండ నూతన ఈవీఎం గోదాముకు ఈవీఎంల తరలింపు
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో తాత్కాలిక ఈవీఎం గోదాముల నుండి హనుమకొండ జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను హనుమకొండ సుబేదారి రెడ్ క్రాస్ వెనకాల నూతనంగా నిర్మించిన జిల్లా ఈవీఎంల గిడ్డంగి( గోదాం)కు బుధవారం పటిష్ట భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో తరలించారు. జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు, వివి ప్యాట్లను భద్రపరిచిన బాక్సుల తరలింపు ప్రక్రియను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు లోని ఈవీఎం గోదాముల వద్ద జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రత్యక్షంగా ఉండి తరలింపు ప్రక్రియను పరిశీలించారు.
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎంల గోదాంలకు వేసి ఉన్న సీళ్లను తెరిచి ఈవీఎం, వివిప్యాట్ల బాక్సులను నూతనంగా నిర్మించిన శాశ్వత ఈవీఎం గోదాంకు పటిష్ట పోలీస్ భద్రత మధ్య అధికారులు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, తహసిల్దార్లు ,రవీందర్ రెడ్డి, రాజు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, డిప్యూటీ తాసిల్దార్ శ్యాం కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్యాంసుందర్, రజనీకాంత్, ఎండి నేహాల్, మహమ్మద్ రహీం ఖాన్, వీరానంద్, తదితరులతోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




