5 August, 2026 | 3:38 AM

తాత ఈస్ గ్రేట్

04-08-2026 05:28 PM

భైంసా,(విజయక్రాంతి): ఆయన నడిచి వెళ్తే.. అందరూ మెచ్చుకునేవారు. రవాణా మార్గం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ ఎక్కడికి వెళ్లిన నడిచి వెళ్లేవాడు. కుంటల మండల కేంద్రంలో జక్కుల ముత్యాలు అనే శతక వృద్ధుడు ( 101) మంగళవారం మృతి చెందారు. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక  తో గ్రామంలో అందరికీ కోలాటాలు నేర్పి కోలాట ముత్యాలుగా పేరు పేరు ప్రఖ్యాతులు పొందారు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే ఆయన 101 ఒక్క సంవత్సరాల బతికి మృతి చెందడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు