26 August, 2026 | 2:37 AM

ఘనంగా పలారం బండి ఊరేగింపు

26-08-2026 12:00 AM

 మోహన్‌నగర్‌లోని చిట్టారమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ఆగస్టు 25(విజయక్రాంతి): ఎల్‌బీ నియోజకర్గ పరిధిలోని మోహన్‌నగర్‌లోని చిట్టారమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తి, ఆధ్యాత్మికతతో నిర్వహించే ఇలాంటి ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయన్నారు. పలారం బండి కార్యక్రమంలో కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. కార్యక్రమంలో సత్యనారాయణ, యువ నాయకులు, కాలనీ వాసులు, కాలనీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.