30 April, 2026 | 2:51 AM

బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టికి ఘన వీడ్కోలు

30-04-2026 01:21 AM

కామారెడ్డి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి):బదిలీపై వెళ్తున్న  అదనపు కలెక్టర్ బాన్సువాడ ఆర్డిఓ డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి కి బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా యంత్రాంగం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహిం చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, డాక్టర్ కిరణ్మయి  జిల్లాలో పనిచేసిన కాలంలో నిబద్ధత, అంకితభావంతో సేవలందించి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఆమె తీసుకున్న చొరవ జిల్లా అభివృద్ధికి దోహదపడిందన్నారు.

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని సత్వర పరిష్కారానికి కృషి చేయడం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేయడం ఆమె ప్రత్యేకత అని కలెక్టర్ పేర్కొన్నారు. యువ అధికారులకు ఆమె పనితీరు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి మాట్లాడుతూ, ఇది తనకు శిక్షణ కాలమని, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  మార్గదర్శకత్వంలో అనేక అంశాలు నేర్చుకున్నానని తెలిపారు.

కలెక్టర్  సలహాలు, సూచనలు, ప్రోత్సాహం తన వృత్తి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు.జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, బాన్సువాడ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మదు మోహన్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని డాక్టర్ కిరణ్మయి ని సన్మానించి జ్ఞాపికను అందజేశారు.