30 April, 2026 | 2:48 AM

సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం

30-04-2026 01:20 AM

నాగోల్, ఏప్రిల్ 29(విజయ క్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలోని రామాంజనేయ కాలనీలో ప్రజల అభ్యర్థన మేరకు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చా రు. కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు తెలిపారు.

ఇటీవల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో సుమారు రూ.66 లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులు మంజూరు చేసి పూర్తి చేయించడంతో సమస్యలు గణనీయంగా తగ్గాయని వారు కృతజ్ఞతలు తెలిపా రు. అదేవిధంగా కాలనీలో మంచినీటి సదుపాయం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, కొన్ని గల్లీలలో కొత్త వాటర్ లైన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలోని సమస్యలను సమగ్రంగా పరిశీలించి మిగిలిన అభివృద్ధి పనులను దశలవా రీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెర్కు సంగీత ప్రశాంత్ గౌడ్, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు చిరంజీవి, సతీష్ యా దవ్, శిల్పారెడ్డి, సీతారాములు, రమేష్, పోచంపల్లి రా జేందర్‌రెడ్డి, కాలనీవాసులు సత్తిరెడ్డి, వెంకట రాములు, రవి తదితరులు పాల్గొన్నారు.