24 June, 2026 | 1:01 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి

24-06-2026 11:45 AM

ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్ కింద రూ.5.40 కోట్లతో 27 గ్రామ పంచాయతీ భవనాలనిర్మాణాలకు పరిపాలన అనుమతి* 

 షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

షాద్ నగర్ జూన్ 24 (విజయక్రాంతి): షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలో 27 కొత్త గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి  పరిపాలన అనుమతి మంజూరు చేశారనీ షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ "వీర్లపల్లి శంకర్" వెల్లడించారు. బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారు.  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్) కింద ఈ పనులు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు.

జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ సమర్పించిన సాధ్యాసాధ్యాల నివేదిక, అంచనా వ్యయాల ఆధారంగా మొత్తం రూ.5.40 కోట్ల వ్యయంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ నిర్మాణాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేశారనీ ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్ వార్షిక మాస్టర్ సర్క్యులర్ 2024-25 ప్రకారం అనుమతించదగిన పనిగా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధుల మేరకు దశలవారీగా పనులు చేపట్టనున్నారు. మొదటి విడతలో చౌదర్‌గూడ మండలంలోని చౌదర్‌గూడ, పెద్దాపూర్ గ్రామాలు, ఫరూఖ్‌నగర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి తలా రూ.20 లక్షల చొప్పున అంచనా వ్యయాన్ని ఆమోదించారు.

ఈ నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామీణ పరిపాలన మరింత బలోపేతం కానుందని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి పరిపాలన అంశాలను గాలికి వదిలేసారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామపంచాయతీల మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు.

మంజూరైన గ్రామ పంచాయతీలు 

ఫరూక్ నగర్ మండలంలో 

దొంతికుంట తండా, కిరాయి గుట్ట తండా, ముండూరి రాయి, నేరెళ్ల చెరువు, పీర్లగూడ, పులిచెర్లకుంట, రామేశ్వరం, రంగంపల్లి, శేరిగూడ, వెంకన్నగూడ తాండ, అయ్యవారిపల్లి, 

చౌదర్‌గూడ మండలంలో 

చౌదర్‌గూడ, పీర్జాపూర్, 

కేశంపేట్ మండలం

అల్వాల్, దత్తాయిపల్లి

కేశంపేట్, సంతాపూర్

తుర్పుగడ్డ, దేవునిగూడ

కొందుర్గు మండలంలో 

చెర్కుపల్లి, ముట్పూర్,

అయోధ్యపూర్ (టి), శ్రీరంగాపూర్, తంగెళ్లపల్లి,

కొత్తూరు మండలంలో 

కోడిచెర్ల తండా, వైఎం తండా

నందిగామ మండలం

తాళ్ళ గూడ ఈ గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అదేవిధంగా నియోజకవర్గంలో మరో రెండు కోట్ల రూపాయల నిధులతో సిసి రోడ్ల పనులు త్వరలో చేపట్టబోతున్నట్లు తెలిపారు.