అట్టహాసంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ఠాపన మహోత్సవం
నాగిరెడ్డిపేట్, మే 14( విజయక్రాంతి): శరీరం, మనసు జీవాలైనటువంటి విగ్రహంలో ప్రాణాన్ని పంచభూతాలను ఆహ్వానించి దైవచైతన్యాన్ని విగ్రహంలో ఆహ్వానించడమే ప్రతిష్టాపన చేయడమని పసలవాడి బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు.
మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమానికి సిద్ధాంతి హాజరయ్యారు. ఆత్మ లింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం గ్రామస్తులు భక్తులు ఘనంగా జరుపుకున్నారు.లోక కళ్యాణార్థమై పెద్ద ఆత్మకూరు గ్రామంలో సుందరమైన శివ దేవాలయాన్ని నిర్మించుకొని వైభవంగా త్రయాహిన్యక విధానంలో శ్రీశ్రీశ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం రెండవరోజు అట్టాసంగా జరుపుకున్నారు.
మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఆవహిత దేవత పూజనం,ఆవహిత దేవత హవనం,చండి రుద్ర, మూలమంత్ర హవనం, పంచసూక్త హవనం,ధన్యది వాసం,ప్రసాద సంస్కారం,పాలపుష్ప దివాసములు,శయ్య దివాసములు,మహా ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమ్మన్నగారి లక్ష్మి,మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి,మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి,టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీగారి సుభాన్ రెడ్డి, గ్రామస్తులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.






