31 August, 2026 | 3:23 AM

యావాపూర్‌లో ఘనంగా బోనాలు

31-08-2026 02:24 AM

తూప్రాన్, ఆగస్ట్ 30 : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామ సర్పంచ్ యాంజాల స్వామి ఆధ్వర్యంలో పోచమ్మకు ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త యంజాల విట్టల్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా నిర్వహించారు. అనంతరం అతిథులుగా విచ్చేసిన వారిని గ్రామ సర్పంచ్ శాలువాలతో సన్మానించారు.

గ్రామంలోని మహిళలు భక్తితో అమ్మవారికి తయారుచేసి పలు వీధులగుండా బోనం నెత్తిన ఎత్తుకొని పోచమ్మ తల్లికి సమర్పించుటకు బయలుదేరారు. దారిపొడుగునా శివశక్తుల పునకాలతో శివాలెత్తారు. ఇందులో ఇందులో మాజీ కౌన్సిలర్ పల్లెర్ల రవీంద్ర గుప్తా, నాయకులు పురం రవి, జింక మల్లేష్, బక్క నవీన్ గౌడ్, రిపోర్టర్ నరేష్, రామస్వామి, సత్యం, పల్లె నరసింహులు, గ్రామ పెద్దలు, అంబేద్కర్ సంఘ సభ్యులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.