31 August, 2026 | 3:26 AM

సాంకేతిక పరిజ్ఞానంతో మహిళ హత్య : డీఎస్‌పీ వెంకటేశ్వర్లు

31-08-2026 02:26 AM

రాజాపూర్ ఆగస్టు 30: నేరం చేసి పోలీసుల నుండి  తప్పించుకోవడం ఎంతటి వారి కైనా సాధ్యం కాదని జిల్లా డిఎస్పి వెంకటేశ్వర్లు (DSP Venkateshwarlu) అన్నారు. ఆదివారం రాజాపూర్ పోలీస్ స్టేషన్ల మహిళా హత్యపై ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 18 తారీఖున హత్యకు గురైన వనపర్తి జిల్లా (Wanaparthy District) ఏదుల మండలం సింగయ్య పల్లి తాండ కు జటావత్ లాలి గత రెండు మూడు సంవత్సరాల నుండి బాలానగర్ మండల కేంద్రంలో రూమ్ అధ్యక్ష తీసుకొని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.

హత్య కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చోటే ఖాన్ 41 షాద్నగర్ సమీపంలో ఓ మహిళ తో శరీరక సంబంధం ఏర్పడింది. సదరు మహిళా మృతురాలి లాలిని రెండు సంవత్సరాల క్రితం చోటే ఖాన్ కు పరిచయం చేసింది. అప్పటినుండి మృతురాలతో తరచూ కలిసేవారు. ఈ క్రమంలో ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి కలిసి మందు తాగే వారు. చోటే ఖాన్ భార్య చనిపోవడంతో లాలిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆమెను లారీలో ఎక్కించుకొని బెంగళూరు తమిళనాడు నాగపూర్ తదితర ప్రాంతాలకు తిప్పేవాడు.

తనను పెళ్లి చేసుకోమని తమ సొంత గ్రామంలో నివసిద్దామని ఆమెను కోరగా ఆమె చూద్దాంలే అని మాటను దాటవేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు మధ్యలో కొన్నిసార్లు గొడవలు అయినా జరిగినట్లు తెలిపారు. రెండు మూడుసార్లు సార్లు ఈ రూట్లో లారీని తీసుకొస్తున్న చోటే ఖాన్ ఆమెకు ఫోన్ చేసినా ఆమె తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంది. ఈనెల 15న కేరళ కు లోడ్ తో వెళ్లి తిరిగి 18 వ తారీఖున బాలనగర్ వస్తున్నా కలుద్దామని చెప్పి మృతురాలికి ఫోన్ చేశాడు.

నిందితుడు మార్గమధ్యలో ఆరు ఓసి క్వార్టర్లు తీసుకొని బాలానగర్  వచ్చి మృతురాలికి ఫోన్ చేయగా ఓ ఫంక్షర్ షాప్ దగ్గర లారీ ఆపి ఫోన్ చేశాడు. ఐదు నిమిషాలు ఆగు ముందు లారీ దగ్గర ఉన్నానని మృతురాలు చెప్పింది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఆమె మహిళ కనిపించడంతో ఆమెపై అనుమానం పెంచుకొని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను లారీ ఎక్కించుకొని నిన్ను అన్ని విధాల చూసుకుంటున్న నన్ను మోసం చేస్తావని ఇద్దరూ లారీలు కొద్దిసేపు గొడవపడ్డట్లు తెలిపారు.

దీంతో ఆవేశానికి గురైన చోటే ఖాన్ కూరగాయల కోసే కత్తితో లారీలోనే ఆమె  గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని రాజపూర్ మండలం గంగారెడ్డిగూడెం శివాల్లో పడేసి వెళ్లిపోయాడు. స్థానిక గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతురాలి వివరాలు సేకరించారు. మృతురాలి రూములో దొరికిన ఫోన్ సిమ్ కార్డు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డ్ ద్వారా పక్క పక్క ఆధారాలతో నిందితుడిని గుర్తించి  ఆదివారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన తెలిపారు. చోటే ఖాన్ తనే లాలిని హత్య చేసినట్లు తెలిపినట్లు డిఎస్పి వివరాలు వెల్లడించారు. మహిళా కేసును 10 రోజులలో చేదించిన సిఐ మహేష్ కుమార్, ఎస్‌ఐ రాజశేఖర్ పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.