జోగులాంబ స్టేషన్‌కు అన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్ల హాల్ట్
ఎంపీ మల్లు రవి
అలంపూర్ ఆగస్టు 30: జోగులాంబ రైల్వే స్టేషన్కు అన్ని సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు.ఆదివారం శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే స్టేషన్ను ఆయన సందర్శించారు.రైల్వే అధికారులతో ప్రయాణికులు, జోగులాంబ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాలపై చర్చించారు. తన పోరాటం ఫలితంగా ఇప్పటికే పలు సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ లభించిందని తెలిపారు.అమృత్ పథకం కింద జరుగుతున్న స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు.
భక్తులు, ప్రయాణికులకు మరిన్ని మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను కోరారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జోగులాంబ ఆలయ సేవలు, దర్శన వివరాలను స్టేషన్లో డిస్ప్లే చేయాలని సూచించారు.అవసరమైతే పూజా టికెట్లు స్టేషన్లోనే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.జోగులాంబ క్షేత్రానికి వచ్చే భక్తులకు రైల్వే ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు






