పన్నూర్‌లో ఎస్ఐఆర్ ఫేజ్-2పై గ్రామ సభ
రామగిరి మండలం పన్నూర్‌లో సర్పంచ్ చిందం మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా SIR ఫేజ్-2 గ్రామ సభ
ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణపై ప్రజలకు అవగాహన
హాజరైన ఆర్డీవో కాశబోయిన సురేష్, తహసీల్దార్ పి. సుమన్
రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలం పన్నూర్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళనే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR (Special Intensive Revision) ఫేజ్-2 కార్యక్రమంపై గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ చిందం మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు మంథని ఆర్డీవో కాశబోయిన సురేష్,రామగిరి మండలం తహసీల్దార్ పి. సుమన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ,లాజికల్ డిస్క్రిపెన్సీల నివారణ,మరియు డ్రాఫ్ట్ రోల్స్‌పై ప్రజలకు అధికారులు దిశానిర్దేశం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ,ఎవరైనా అనర్హులు ఉంటే తొలగింపునకు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదుకు ఈ వేదిక ద్వారా అవగాహన కల్పించారు. సభ అనంతరం సర్పంచ్ చిందం మహేష్ జిల్లా అధికారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ ఎమ్మార్వో,మానస,Gpo వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి,వార్డ్ సభ్యులు చేతి సుధాకర్, కృష్ణ కుమార్ blo bla పాల్గొన్నారు.






