29 April, 2026 | 5:46 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

27-04-2026 08:20 PM

సర్పంచ్ తాలూకా మహేశ్వరీ, సాయిబాబా

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల పరిధిలోని చందాయిపేట్,  గ్రామం లో సొసైటీ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం సొసైటీ సి ఈ ఓ సంతోష్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ముఖ్యంగా సన్న రకం వడ్లకు ప్రభుత్వం క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ అందిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.