రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుంది
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి
గరిడేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియంత పాలన నడుస్తుందని హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి విమర్శించారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటినుండి తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
తాను ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేక విధానాల తో నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన దీర్ఘకాల పోరాటం ద్వారా రాష్ట్రం సాకారమైన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామ శాఖ అధ్యక్షులు ప్రధాని సైదులు జెండా ఆవిష్కరించగా, పెండెం శోభారాణి ధనయ్య గౌడ్ కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు.






