16 March, 2026 | 8:25 PM

మేడిపల్లి ఇన్ స్పెక్టర్ గా చింత శంకరయ్య

16-03-2026 07:08 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఇన్ స్పెక్టర్ గా చింత శంకరయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సిఐ గా విధులు నిర్వహించిన గోవిందరెడ్డి ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వెళ్లారు. ఆయన స్థానంలో అల్వాల్ ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వహిస్తున్న చింత శంకరయ్య బదిలీపై మేడిపల్లి సిఐగా వచ్చారు. శంకరయ్య వచ్చి విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు.