రెసోనెన్స్ విద్యార్థిని రుషికి గవర్నర్ సత్కారం
19-05-2026 12:00 AM
హైదరాబాద్, మే 18(విజయక్రాంతి): తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్) 2026లో మొదటి ర్యాంకు సాధించిన రెసోనెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థిని రుషిని గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల లోక్ భవన్‌లో సోమవారం సత్కరించారు. ఆమె అద్భుత ప్రదర్శనకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రుషి తల్లి మార్కెండేయ తదితరులు ఉన్నారు.






