19 May, 2026 | 5:20 AM

వాటర్ ప్లాంట్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

19-05-2026 12:00 AM
  1. కావాలనే ప్రారంభోత్సవం చేయడంలేదని బీఆర్‌ఎస్ ఆరోపణ
  2. పోతిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత.. పోలీస్ పికెట్ ఏర్పాటు

నాగర్ కర్నూల్, మే 18 (విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాసిపేట మం డలం పోతిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలో ఏర్పడ్డ నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని దాతలు గ్రామ పంచాయతీ పరిసరాల్లో నూతన నీటి ప్లాంట్ ఏర్పాటు చేశారు. సోమవారం నీటి ప్లాంట్ ప్రారంభం చేసే క్రమంలో గ్రామంలోని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో గొడవకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు నీటి ప్లాంట్‌ను మూసేందుకు ప్రయ త్నించగా గ్రామస్తులంతా కాంగ్రెస్ కార్యకర్తలతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

సర్పంచ్ కల్పన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతోనే నీటి ప్లాంటును ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావాలనే అడ్డు కుంటున్నారని వాపోయా రు. ఈ క్రమంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు గ్రామంలో 144 సెక్షన్ విధించేలా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది.