27 July, 2026 | 3:13 AM

బాల్యవివాహాలు జరిపితే కఠిన చర్యలు

27-07-2026 02:22 AM

రేగోడు, జులై 26: బాల్య వివాహాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్త్స్ర పోచయ్య అన్నారు. 18 సంవత్సరాలు నిండని వారికి వివాహాలు జరపరాదని గజవాడ గ్రామంలో శనివారం రాత్రి ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వాహనాలు నడిపే వారు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. వ్యవసాయ భూములకు వెళ్లి వచ్చేవారు గుర్తు తెలియని వారు అటకాయించిన చొ నమ్మి మోసపోకూడదని తెలిపారు, అభరణాలపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.