23 May, 2026 | 7:07 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం

12-03-2026 12:42 AM

కేసముద్రం, మార్చి 11 (విజయక్రాంతి): మాతా శిశు సంక్షేమానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అల్లం రమ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య లక్ష్మీ కమిటీ చైర్మన్ గా డాక్టర్ అల్లం రమ, గర్భిణీలు, బాలింతలతో నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల పైబడిన చిన్నారులందరినీ అంగన్వాడి కేంద్రానికి పంపించాలని, అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు పౌష్టిక ఆహారంతో పాటు, ఆట పాటలతో, క్రమశిక్షణతో కూడిన విద్యా అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాజమణి, అరుణ, అనసూర్య ,ఆశ వర్కర్స్ సుజాత, నాగమణి, చంద్రకళ, శాంత, సింధు యాదవ్, ఎండి నగ్మా, జహీరా, మౌనిక, వెంకటలక్ష్మి, రోహిణి, భద్రమ్మ, ఉదయ పాల్గొన్నారు.