ఓటు హక్కును కాపాడుకోవాలి.. ప్రతి ఓటును నమోదు చేయాలి
రుద్రంగి ఆగష్టు 27 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేం ద్రంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు.. గ్రామ సభలో పాల్గొని SIR ప క్రియ పై అవగానా కల్పించి స్మార్ట్ రేషన్ కా ర్డులు వారు పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించడంతో పాటు, అర్హులైన ప్ర తి ఒక్కరి ఓటును ఓటరు జాబితాలో నమోదు చేయాలని బూత్ లెవల్ ఏజెంట్ల సహకారంతో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీ లించి, ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
రుద్రంగి మండల కేంద్రంలో 1,937 అనుమానాస్పద ఓట్లను జాబితాలో చేర్చారని ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో సభలు నిర్వహించాల ని సూచించారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓ టును జాబితాలో చేర్చాలని, ఒక్క ఓటు కూ డా కోల్పోకుండా చూడటం లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల లను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కా ర్డులు అందించే ప్రక్రియను చేపట్టిందన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందన్నారు.దేశంలో మరే రా ష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సన్న బి య్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎం దుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో తెలంగాణ రా ష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
కాంగ్రెస్ బీజేపీ నాయకుల తోపులాట
రుద్రంగిలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్న రేషన్ కార్డుల పంపిణీ కా ర్యక్రమం రసాభాసగా మారింది ప్రధానమంత్రి మోడి ఫోటో రేషన్ కార్డుపై లేకపోవ డంతో బిజెపి నాయకులు నిరసనకు దిగా రు. ఉచిత రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార రెడ్డి ఫోటో పెట్టి మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యే ను ప్రశ్నించారు.దింతో కాంగ్రెస్ బిజెపి నాయకుల మధ్య గొడవ జరిగింది ఒకరికొకరు పా ర్టీ నినాదాలు చేస్తూ తోసుకున్నరు.పోలీసు లు కలుగచేసుకొని ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పారు.






