హెల్త్ కార్డ్స్‌పై ఉపాధ్యాయుల, ఉద్యోగుల సందేహాలు ప్రభుత్వం నివృత్తి చేయాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
సికింద్రాబాద్,ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యా యులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఉపాధ్యాయఎమ్మెల్సీ మల్క కొమ రయ్య అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లా డుతూ పిఆర్సిఅమలు చేసిన తర్వాతనే ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ స్వీకరించాలి తెలియజేస్తూ, అప్పటివరకు ప్రభుత్వమే భరించాలి అన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ చికిత్స విధానంపై ప్రభు త్వం మరింత స్పష్టతివ్వాలన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. ఫిబ్రవరి 23న క్యాబినెట్ ఆమోదించిన డిజిటల్ హెల్త్ కారడ్స్ పాలసీపై స్పందించిన ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతి స్తున్నామని తెలియజేస్తూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా నెలసరి వేతనాలను నేరుగా చెల్లించాలి, అలాగే కేజీ బీవీ, ఎస్‌ఎస్‌ఎ, యుఆర్‌ఎస్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కారడ్స్ మంజూరు చేస్తూ, కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వమే చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కోమరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




