ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ఎంపీడీవో శివకృష్ణ
నిజాంసాగర్ మే 11(విజయక్రాంతి): పీఎంశ్రీ టీజీఎంఎస్ అచ్చంపేట్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిజాంసాగర్ ఎంపీడీవో శివకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉన్నత వర్గాలకు అందుబాటులో ఉండే సమ్మర్ క్యాంప్‌లను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం వల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులంతా సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సమ్మర్ క్యాంపులో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ, ఇండోర్ ఆటలు, యోగా, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న నిజాంసాగర్ మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, ఎండాకాలంలో విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా సమ్మర్ క్యాంప్‌లు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ నగర్ మండల విద్యాశాఖాధికారి వెంకటేశం , అచ్చంపేట్ సర్పంచ్ లక్ష్మయ్య , టీజీఎంఎస్ అచ్చంపేట్ ప్రిన్సిపాల్ కార్తీక సంద్య , వైస్ ప్రిన్సిపాల్ సాయిబాబా పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






