తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్
11-05-2026 11:20 AM
ఎర్రుపాలెం మే 11 (విజయ క్రాంతి):మండల పరిధిలోని తక్కెళ్ళపాడులో సోమవారం నాడు సర్పంచ్ ముక్కర రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో, పంచాయతీ నిధుల నుండి గ్రామ పంచాయతీ ఆఫీస్ చుట్టూ ప్రహరీ నిర్మాణం కొరకు శంకుస్థాపన పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భద్రాచలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, ఉప సర్పంచ్ కూరపాటి రమేష్ , ఇందిరమ్మ కమిటీ సభ్యులు శీలం చిన్న రామిరెడ్డి , వార్డ్ సభ్యులు కూరపాటి వరుణ్ , తల్లపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి , తలుపుల విజయబాబు ,మాజీ ఎంపీటీసీ సభ్యులు ముక్కర లక్ష్మ రెడ్డి ,మాజీ ఉప సర్పంచ్ అయిలూరి నాగిరెడ్డి , గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణ రావు , మేట్ వేమిరెడ్డి కృష్ణరెడ్డి ,ముక్కర సూరి రెడ్డి ,పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






