3 April, 2026 | 4:12 AM

ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వ పథకాలు

03-04-2026 12:57 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఏప్రిల్ 2 : ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభు త్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జైపూర్ మం డలం టేకుమట్లలోని రైతు వేదికలో ఏర్పా టు చేసిన గ్రామసభలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణలతో కలిసి హాజరై 99 రోజుల కార్యచరణ, ప్రణాళికను అధికారుల ద్వారా చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అర్హులైన లబ్ధిదారులకు ఫలాలు అందించే విధంగా కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని 306 గ్రామపంచాయతీలలో గ్రామసభలు జరిగాయని, 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల నిర్వహణ, పారిశుద్ధ్య అమలు, త్రాగునీటి సరఫరా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ అనుభవాలు, అభిప్రాయాలను వెల్లడించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.