3 April, 2026 | 4:10 AM

ఘనంగా హనుమాన్ జయంతి

03-04-2026 12:59 AM

కాగజ్‌నగర్, ఏప్రిల్, 2 (విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలో హను మాన్ జయంతి వేడుకల ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ లో ఎమ్మెల్సీ దండే విట్టల్, ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బజ్ బజరంగ దళ్ సభ్యులు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. అంతరం  శోభాయాత్రను ప్రారంభించారు. ఈ శోభా యాత్ర ప్రధాన వీధుల గుండా సాగింది. మహారాష్ట్రలోని  డోలు బృందం  పతేక ఆకర్షణగా నిలిచింది.  కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుదీన్ ఆధ్వర్యంలో ప్రత్యే క పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగజ్ నగర్ పట్నం అంతా  జై శ్రీ రామ్ అంటూ మార్మోగింది.