జీపీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి
17-03-2026 03:14 PM
* జిపి కార్మికుల అక్రమ అరెస్టులు అన్యాయం
గరిడేపల్లి,(విజయక్రాంతి): ఎన్నికల ముందు జీపీ కార్మికులకు కనీస వేతనం రూ.18,000 అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడం అన్యాయమని సీఐటీయూ జిల్లా నాయకుడు షేక్ యాకోబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనంతో పాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చలో సెక్రటేరియట్ కు వెళ్లుతున్న గ్రామ పంచాయతీ కార్మికులను పోలీసులు అరెస్టు చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో గొపగాని సత్యనారాయణ, నర్సిరెడ్డి, రావుల వెంకన్న, బొంత వెంకట్ రెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.




