30 July, 2026 | 11:57 AM

కూసుమంచిలో దొంగల ముఠా అరెస్ట్

30-07-2026 11:06 AM

9మోటర్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్న కూసుమంచి పోలీసులు

కూసుమంచి, (విజయక్రాంతి): మోటార్ సైకిళ్ళను చోరీ చేస్తున్న కొందరు అంతర్ జిల్లా దొంగల మూఠాను కూసుమంచి, ఖమ్మం రూరల్ పోలీసులు(Khammam Rural Police) అరెస్ట్ చేసినట్లు కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం దొంగలను రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. కూసుమంచి, ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారు ఖమ్మం రూరల్, ఖమ్మం III టౌన్, ఖానాపురం హవేలి, కూసుమంచి,  సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు మోటార్ సైకిల్ చోరీ కేసులకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

విచారణలో ప్రధాన నిందితుడు తనతో పాటు నలుగురు  జువెనైల్ లతో కలిసి రాత్రి వేళల్లో మోటార్ సైకిళ్లను డూప్లికేట్ తాళాలతో చోరీ చేసి, వాటిని వివిధ వ్యక్తులకు విక్రయించినట్లు వెల్లడైంది. ఈ కేసులో మండవ సాయి, కొక్కు రోనక్, రామాల మహేందర్, ప్రసాదం రాజు (రిసీవర్)లను అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు మైనర్లు  జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. ప్రధాన నిందితుడు చిలకబత్తిని వెంకటేష్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుల స్వచ్ఛంద ఒప్పుకోలు మరియు వారి చూపుడు మేరకు మొత్తం 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకొని వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదైన 9 మోటార్ సైకిల్ చోరీ కేసులను ఛేదించడం జరిగింది.