ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు
దేవరకొండ,(విజయక్రాంతి): మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు, మెప్మా సిబ్బందికి ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం దేవరకొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు, మెప్మా సిబ్బందికి ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య శిబిరంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పట్టణ పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం అత్యంత ముఖ్యం.
వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి శిబిరాలను తరచుగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. పట్టణాన్ని శుభ్రంగా ఉంచే వారికి ఆరోగ్యం కాపాడటం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సాయి చంద్ర, అంకులమ్మ, సుమలత, రూప్ల నాయక్, నాయకులు పున్న వెంకటేశ్వర్లు, గుద్దేటి సత్యం, హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ విజయ, సిబ్బంది పాల్గొన్నారు.




