30 July, 2026 | 11:47 AM

వర్షాకాలంలో అప్రమత్తమే రక్షణ.. ప్రజలకు ఎస్‌ఐ సూచనలు

30-07-2026 11:04 AM

ప్రజలకు ఎస్‌ఐ అనిల్ సూచనలు

భిక్కనూర్, జూలై 30, విజయ క్రాంతి): వర్షాకాలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భిక్కనూర్ ఎస్‌ఐ అనిల్ సూచించారు. వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని, చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎలాంటి ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహాయం పొందాలని ఎస్‌ఐ అనిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.