30 July, 2026 | 11:32 AM

నినాదాలతో హోరెత్తిన లోక్‌సభ.. 2 గంటల వరకు వాయిదా

30-07-2026 11:24 AM

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో, గురువారం లోక్‌సభ సమావేశాలు(Lok Sabha adjourned) ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) సభ్యులను కోరారు. కానీ ప్రతిపక్షం వెనక్కి తగ్గకపోవడంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అమిత్ షా(Amit Shah) పార్లమెంట్ కు వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

నిన్న లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు కూడా 'ప్రశ్నోత్తరాల సమయం' (Question Hour) జరగలేదు. అయితే, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. 50 లక్షల జరిమానా వంటి కఠినమైన శిక్షా నిబంధనలతో కూడిన 'పరీక్షా పత్రాల లీకేజీ నిరోధక చట్ట సవరణ బిల్లు' మాత్రం ధ్వని ఓటు ద్వారా ఆమోదం పొందింది.