మోడల్ టీచర్ల క్యాడర్ విభజనకు సర్కారు అనుమతి
హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల క్యాడర్ విభజనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. శని వారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. 2018 ఉత్తర్వులు ప్రకా రం కొత్త జోనల్, మల్టీ జోన్‌ల వారీగా క్యాడ ర్ విభజించేందుకు ఉపాధ్యాయలు నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 16 లోపు ఉపాధ్యాయులు జోన్ల వారీగా ఆప్ష న్లు ఇచ్చుకొని ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ ఫా మ్‌లను సమర్పించాల్సి ఉంటుంది.
ప్రిన్సిపాల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లను మల్టీజోన్‌గా, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లను జోనల్ కింద విభజించనున్నారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల క్యాడర్ విభజన పూర్తయినా కోర్టు కేసుల కారణంగా మోడల్ టీచర్ల విభజన వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల హై కోర్టు ఉత్తర్వులతో ప్ర భుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది.




