హాస్టల్‌లో విద్యార్థుల కామ క్రీడలు!
- ఇంటర్ పరీక్షల అనంతరం వ్యవహారం
స్వతహాగా వీడియోల చిత్రీకరణ
స్థానికులు గమనించి దేహశుద్ధి
ఫోన్‌లో మరిన్ని వీడియోలు?
నాగర్‌కర్నూల్, మార్చి 7 (విజయక్రాం తి) : నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ హాస్టల్‌లో మైనర్లు కామ క్రీడల్లో మునిగితేలారు. ఇంటర్ పరీక్ష అనంతరం నేరుగా హాస్టల్‌కు వెళ్లి వ్యవహారం జరిపారని విశ్వసనీయంగా తెలిసింది. స్వయంగా వీడియోలు సైతం చిత్రీకరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. స్థానికులు గమనించి దేహశుద్ధి అనంతరం పోలీసులకు అ ప్పగించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
జిల్లాలోని ఓ హాస్టల్‌లో ఉంటూ, బ యట ఉన్న కాలేజీలో ఓ విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. ఆ కళాశాలలోని తోటి విద్యార్థిని పట్ల స్నేహంగా మెలుగుతూ ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఇంటర్ పరీక్ష అ నంతరం విద్యార్థినిని తన హాస్టల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతూనే వీడియోలు కూడా చిత్రీకరించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గమనించిన స్థానికులు ఆ విద్యార్థికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. కాగా ఈ వ్యవహారంలో యువకుడి సెల్ ఫోన్‌లో మరి కొంతమంది విద్యార్థినుల వీడియోలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.




