16 July, 2026 | 12:17 PM

దొంగతనాలతో బెంబేలెత్తుతున్న సోనాల వాసులు

16-07-2026 12:06 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో గ్రామస్తులు ఆందోళనలకు గురవుతున్నారు. గత వారం రోజుల నుండి దొంగలు ద్విచక్ర వాహనాలను పట్టపగలే తీసుకు వెళ్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపి పొలం పనులకు వెళ్లిన రైతుల ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లడంతో తీవ్ర ఆందోళనచెందుతున్నారు. మరోవైపు గ్రామంలో ఇండ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలను సైతం ఎత్తుకెళ్తున్నారు. రెండు రోజుల క్రితం సాకేర గ్రామ బస్టాండ్ లో ఇంటిముందు నిలిపించిన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకు వెళ్లడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది..   

గస్తీ తిరిగితేనే

అభివృద్ధి చెందుతున్న సోనాల మండల కేంద్రంలో వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు అధిక మొత్తంలో ఉంటున్నారు.దీంతో కొత్త కొత్త వ్యక్తులు వచ్చి వెళుతున్నవారిపై నిఘా లేకపోవడంతో రోజంతా రెక్కీ నిర్వహించి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు.. 

వైన్ షాపులో దోపిడి పథకం ప్రకారం జరిగింది

మంగళవారం మండల కేంద్రంలోని వైన్ షాపులో దోపిడీ పథకం ప్రకారం జరిగిందని గ్రామస్తులంటున్నారు. సీసీ కెమెరాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించి దోపిడీకి పాల్పడ్డారు అయితే ఎలాంటి ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దోపిడీకి పాల్పడ్డారు దీన్ని బట్టి చూస్తే దోపిడీకి పాల్పడిన వారు ముందుగా ఇక్కడి పరిస్థితులను గమనించిన వారే అని పలువురు అంటున్నారు. కాచిగూడ దొంగతనాలు అరికట్టేందుకు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానికులు పేర్కొంటుండగా గ్రామస్తులు గస్తీ నిర్వహిస్తే కొంతమేరకు దొంగతనాలను అరికట్టే ఆస్కారం ఉంది