ప్రజా సమస్యల పరిష్కారానికి 99 రోజుల కార్యాచరణ
జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి
మలక్‌పేట్, మార్చి 7 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీ హెచ్ యం సి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.
జోనల్ కమిషనర్ సాలిపేట శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఉదయం అధికారులతో కలసి ముసారం బాగ్, మలక్ పేట్ సర్కిల్ పరిధిలోని మలక్ పేట్ నల్గొండ చౌరస్తా, చాదర ఘాట్ రోటరీతో పాటు స్థానిక ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి పారిశుధ్య నిర్వహణ, రోడ్ల సమస్యలపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రభుత్వం 99 రోజుల కార్యచరణతో చేపట్టిన ప్రజా పాలన -పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నమన్నారు. ఈ పర్యటనలో ముసారంబాగ్, మలక్‌పేట్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు భాస్కర్ రెడ్డి, ఇంకేషఫ్ అలీ, ఇంజనీరింగ్ ఎస్‌ఈ ఇందిరా, యూబీడి డిప్యూటీ డైరెక్టర్ దేవజ, ఏఎంహెచ్‌ం డాక్టర్ రుద్ర శ్రీనివాస్, ఎస్‌డబ్ల్యూఎం డిఈలు నవీన్ కుమార్, రంజిత్‌రెడ్డి, రాంకీ సంస్థ జోనల్ ఇంచార్జి నంద కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.




