11 May, 2026 | 9:42 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

కాసిపేట గనిని సందర్శించిన జీఎం రాధాకృష్ణ

11-05-2026 08:34 PM

కాసిపేట,(విజయక్రాంతి): కాసిపేట 1 ఇంక్లైన్ గని ని మందమర్రి జీఎం ఎన్. రాధాకృష్ణ సందర్శించారు. అండర్ గ్రౌండ్ లోకి దిగి  పని స్థలాలను,యంత్రాల పనితీరును పరిశీలించారు. ఉద్యోగులు మరింత శ్రమించి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలన్నారు. రక్షణ, నాణ్యతతో కూడిన ఉత్పత్తి సాధించాలన్నారు. పోటీ ప్రపంచంలో వినియోగదారులకు నాణ్యత కలిగిన బొగ్గును అందించాలనికోరారు. గనిలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, అధికారులు ఉన్నారని వారి అనుభవాలను తీసుకుని నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు.

యంత్రాలను సరైన పద్దతిలో ఉపయోగించి సంస్థ అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని కోరారు. కాసిపేట గనిలో కార్మికుల గైహాజరు అధికంగా ఉండడతో ఉత్పత్తి తగ్గడానికి కారణం అవుతుందని అన్నారు.గైహాజరు ఉద్యోగుల కు కౌన్సెలింగ్ నిర్వహించి హాజరు శాతాన్ని పెంచాలని  అధికారులకు సూచించారు. గైహాజరు అవుతున్న కార్మికులు ఉద్యోగాలు కోల్పోతే వారి కుటుంబాలు ఇబ్బందులు పడతారని, ఆర్థికంగా వెనుకబడిపోతారని అన్నారు. ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరై కుటుంబాలకు బాసటగా నిలవాలని కోరారు. జనరల్ మేనేజర్ రాధాక్రిష్ణతో మేనేజర్ సతీష్, ఏరియా ఐఈడి సూపరిండెంట్ అప్ ఇంజనీర్ కిరణ్ కుమార్, రక్షణాధికారి సురేష్,సర్వేయర్ ప్రభాకర్,ఖాన్ సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్ ఉన్నారు.