28 July, 2026 | 2:59 PM

బాలిక అదృశ్యం

28-07-2026 02:08 PM

జహీరాబాద్,(విజయక్రాంతి): జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో 12 సంవత్సరాల బాలిక అదృశ్యమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ పట్టణ ఎస్సై లవ కుమార్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అల్లిపూర్ గ్రామానికి చెందిన తమ్మిశెట్టి అక్షయ (12) నీళ్లు తీసుకొని వస్తానని చెప్పి బిందె తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదని ఆయన తెలిపారు.

అక్షయ ఆచూకీ కోసం బంధువుల వద్ద చుట్టుపక్కల వారి వద్ద విచారించిన ఎలాంటి సమాచారం అందకపోవడంతో అక్షయ తండ్రి తమ్మిశెట్టి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లవ కుమార్ తెలిపారు. ఆచూకీ తెలిసినవారు జహీరాబాద్ పట్టణ ఎస్సైకి సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.