సీడీఎంఏ శిక్షణా తరగతులకు హాజరైన ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీడీఎంఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మున్సిపల్ ప్రజాప్రతినిధుల శిక్షణా కార్యక్రమానికి ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం హాజరైంది. ఈ సందర్భంగా తడి, పొడి చెత్త నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ, పట్టణ ప్రణాళిక, డీఆర్‌సీసీలో సేంద్రీయ ఎరువుల తయారీ, మురుగునీటి నిర్వహణ, రహదారులు, కాలువల అభివృద్ధి, వార్డుల వారీగా ఇంటి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నుల వసూళ్లపై నిపుణులు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, కౌన్సిలర్లు సైదుమియా, చిల్లా భారతి, రాధా కోరి, గోపగాని రాజు, రేఖ స్వరూప, గందే పద్మ, మెరుగు కార్తీక్, మొగిలి లక్ష్మి, రంప రమ్య, నిరుడు ఉపేంద్ర, సోనిబాయి కోరి, ఉల్లింగా విజయలక్ష్మి, ఎం.డి. జాఫర్, నీలపు రమేష్, కొర్లపాటి కిరణ్, కో-ఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, పర్రే స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.






