19 June, 2026 | 2:06 AM

పనామాను ఓడించిన ఘనా

19-06-2026 12:54 AM

టొరంటో, జూన్ 18: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఘనా బోణీ కొట్టింది. పనామాతో జరిగిన మ్యాచ్‌లో 1--0 తేడాతో ఘనా విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కాలేబ్ యిరెంకి చివరి నిమిషంలో గోల్ కొట్టి విజయాన్ని అందించాడు. మ్యాచ్ ఆరంభంలోనే పనామాకు గోల్ సాధించే అవకాశం వచ్చింది. ఆ గోల్‌ను ప్రత్యర్థి జట్టు ఘానా గోల్ కీపర్ లారెన్స్ అటి జిగీ సమర్థంగా అడ్డుకున్నాడు.

ఆ తర్వాత కూడా పనామాకు మరో అవకాశం లభించింది. అప్పుడు కూడా ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇక సెకండ్ హాఫ్‌లో ఘనా కు కూడా గోల్ అవకాశం చేజారింది. ఇక సెకండాఫ్‌లో చివరిదాకా ఏ జట్టు కూడా ఒక్క గోల్ కొట్టలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అంతా అనుకున్నారు. అయితే కాలే బ్ మార్ఫో యిరెంకీ చివర్లో అద్భుతం చేశాడు. సునాయాసంగా గోల్ సాధించి ఘానాను గెలిపించాడు. యిరెంకీకి ఇది అంతర్జాతీయ కెరీర్ లో తొలిగోల్.