విద్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
* గిరి విద్య కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మాడ్యులస్ కళాశాలకు విద్యార్థులను పంపిన ప్రాజెక్టు అధికారి మంద మకరందు
ఉట్నూర్,(విజయక్రాంతి): గిరివిద్య కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య.. ఉద్యోగ శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. సోమవారం గిరి విద్య కార్యక్రమంలో భాగంగా గిరి విద్య ప్రోగ్రాంలో ఆశ్రమ గురుకులల్లో చదువుతూ... ఉచిత ఐఐటి జేఈ కోచింగ్ కు ఎంపికైన విద్యార్థులను పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
క్రమశిక్షణ, కష్టపడి చదవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. గిరి విద్య కార్యక్రమం ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ అందించి ఉన్నత విద్యా అవకాశాలను కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులందరూ విద్యాభ్యాసంలో రాణించి తమ కుటుంబానికి, సమాజానికి, ఐటిడిఏకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.






