మండల కేంద్రంలో మర్రిచెట్టు వద్ద భారీ సంఖ్యలో మహిళల పూజలు
29-06-2026 05:06 PM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో వటసావిత్రి పౌర్ణమి పురస్కరించుకొని మహిళలు భారీ సంఖ్యలో మర్రిచెట్టు వద్ద చేరుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుండి సాయంత్రం వరకు మహిళలు మర్రిచెట్టు వద్దకు చేరి మర్రి చెట్టుకు ప్రదక్షణలు చేస్తూ చెట్టు చుట్టూ దారం చుట్టి పూజలు చేయడం జరిగింది. మర్రి చెట్టుకు పూజలు చేస్తే కలిగే ఫలితాలను వేద పండితులు మహిళలకు వివరించారు. భర్తల ఆయుష్షు పెరగడంతో పాటు ఆయురారోగ్యాలతో ఉంటారని వేద పండితులు వివరించారు. బోత్ మండల కేంద్రంలోని మహిళలంతా ఒక్కసారిగా మర్రిచెట్టు వద్దకు రావడంతో జన సందోహంగా మారింది.






