29 June, 2026 | 6:23 PM

అభివృద్ధి పనులతోనే ప్రగతి సాధ్యం

29-06-2026 05:22 PM

రూ.1.65 కోట్లతో మౌలిక వసతుల కల్పన

ప్రజాధనం ప్రతి పైసా సద్వినియోగం కావాలి

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

పాల్వంచ,(విజయక్రాంతి): అభివృద్ధి పనులతోనే గ్రామాలలో ప్రగతి సాధ్యంని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి(ఎస్), బసవతారక కాలనీ, బిక్కు తండా, కేశవాపురం, నాగారం కాలనీ, రంగాపురం, నారాయణరావుపేట, సంగం, దంతలబోర్ గ్రామపంచాయతీల పరిధిలో రూ. 1.65 కోట్లతో సీసీ రోడ్లకు డ్రైన్లకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ పల్లె రహదారులు, గ్రామాల అనుసంధాన రహదారులు, ప్రధాన రహదారుల నిర్మాణంపై ప్రత్యేక ద్రుష్టి సారించి దశలవారీగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నామన్నారు.

రహదారుల సౌకర్యం మెరుగు పడితేనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని, ప్రతి గ్రామం, పంచాయతి కేంద్రాలలో హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామపంచాయతి కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ సేవాకేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. ప్రజలుసైతం పనులపై ద్రుష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, మేయర్ మూడ్ గణేష్ సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, తహసిల్దార్ దారా ప్రసాద్, ఎంపిడిఓ, ఎంపీబిఓ, ఎంఇఓ, తదితరులు పాల్గొన్నారు.