29 June, 2026 | 6:01 PM

ఈఏంఆర్ఎస్ స్కూల్ తనిఖీ

29-06-2026 05:14 PM

జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్

ఎల్లారెడ్డి పేట,(విజయ క్రాంతి): ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఈఎంఆర్ఎస్ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తనిఖీ చేశారు. నిత్యం విధి నిర్వహణలో బిజీ బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ విద్యార్థులకు బోధన చేస్తున్న తీరును వారితో కలిసి కూర్చుని పరిశీలిస్తూ... పాఠ్యాంశం విన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పాఠ్యాంశం ఉపాధ్యాయుడు బోధిస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో కలిసి బెంచి పై కూర్చున్నారు. పాఠ్యాంశం బోధనను స్వయంగా పరిశీలించారు.