2 September, 2026 | 3:37 PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎన్డీసీసీబీ మేనేజర్ కృష్ణ

29-06-2026 | 05:27pm

కోదాడ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) మేనేజర్ కృష్ణ అన్నారు. ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ వీక్ సందర్భంగా సోమవారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో గల సహకార సంఘం గోదాం ఆవరణలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సహకార సంఘాలు కేవలం ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.