26 May, 2026 | 1:02 AM

వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి.. ఆభరణాలు చోరీ

26-05-2026 12:07 AM

మేడిపల్లి, మే 25 (విజయక్రాంతి): లిఫ్ట్ ఇస్తానని వృద్ధురాలిని బైక్ పై ఎక్కించుకొని బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..  సమల చంద్ర మ్మ (75) బోడుప్పల్ ఆర్‌ఎన్‌ఎస్ కాలనీలో కొడుకు వద్ద ఉంటోంది. ఆదివారం ఉదయం ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా, మల్లన్న ఆలయం సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్ పైన వచ్చి నేను కూడా ఆర్‌ఎన్‌ఎస్ కాలనీ వైపే వెళ్తున్నాను అంటూ ఆమెను నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు.

కొంతదూరం తీసుకవె ళ్లి శ్రీ సాయి రాంనగర్ కాలనీలోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో దింపి వెళ్లిపోయాడు. అక్కడ కూర్చున్న వృద్ధురాలిని గమనించిన సెక్యూరిటీ గార్డు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో మనవరాలు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం ఆమె మెడలో ఉన్న సుమారు 8 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.