26 May, 2026 | 1:00 AM

బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

26-05-2026 12:09 AM

ఎల్బీనగర్, మే 25: బీఎన్‌రెడ్డినగర్ డివిజన్‌కు చెందిన యువకులు డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆ ర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీలో చేరిన యువకులకు పార్టీ కం డువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ మాజీ సభ్యుడు అనిల్ చౌదరి, ఉద్యమకారులు మాధవరం నరసింహారావు, గడ్డం మల్లేష్ గౌడ్, నక్క వెంకటస్వామి, అర్జున్ గౌడ్, మనోజ్ గౌరిశెట్టి, కొంగర మహేష్, కొంగర నరేష్, సురేష్‌రెడ్డి, కిరణ్ నేత తదితరులు పాల్గొన్నారు.