క్రికెట్ టోర్నీలో గట్లమల్యాల ఘన విజయం
నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని కొండంరాజుపల్లిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో గట్లమల్యాల జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా కెప్టెన్ రంగు చింటూ గౌడ్ వ్యూహాత్మకతో జరిగిన వివిధ మ్యాచ్‌ల్లో బస్వాపూర్,ముండ్రాయి, పాలమాకుల,రాజగోపాలపేట జట్లపై గట్లమల్యాల టీమ్ వరుస విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో సొంతగడ్డపై ఆడుతున్న కొండంరాజుపల్లి జట్టుపై గట్లమల్యాల టీమ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, కప్‌ను కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన గట్లమల్యాల ఆటగాళ్లను నిర్వాహకులు,అభిమానులు,సర్పంచ్ ఇంగే నరేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.జట్టు గెలుపుకు గుర్తుగా విజేత జట్టుకు రెండు క్రికెట్ బ్యాట్లను అందజేస్తామని సర్పంచ్ తెలిపారు.






