గుంతలమయమైన రోడ్డు... నిలిచిన వర్షపు నీరు
30-07-2026 12:32 PM
భిక్కనూర్, జూలై 30 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట రహదారి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంతలమయంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రహదారి ప్రమాదకరంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటితో నిండిన గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలు కూడా రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే గ్రామపంచాయతీ పాలకవర్గం, సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి నిల్వ నీటిని తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.






