ఒర్రే వద్ద అధికారుల బందోబస్తు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తాసిల్దార్ రామ్మోహన్ రావు
బెజ్జూర్ జూలై 30 (విజయక్రాంతి): బెజ్జూరు మండలంలోని కృష్ణ పల్లి, సుస్మిర్ ఒర్రెలు భారీగా ప్రవహిస్తున్నాయి. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గొర్రెలు భారీగా ప్రవహించడంతో ప్రజలు ఎవరు కూడా ఒర్రెల నుండి దాటకూడదని తహసిల్దార్ రామ్మోహన్ రావు, ఎస్సై సర్దాజ్ పాషా , ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు ఒర్రెలను పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా వర్షం కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదని గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి గ్రామాలలో దండోర వేయించారు. పొలం గట్ల పైకి, చెట్ల కింద ఎత్తైన ప్రదేశాల్లో ఎవరు కూడా ఉండకూడదని పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఒర్రెలు, వాగులు భారీగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండెలా గ్రామాల ప్రజలకు సర్పంచులు సూచించాలని తెలిపారు. వారి వెంట గ్రామ కార్యదర్శి రోజా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






