అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
11-06-2026 02:21 PM
ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నరేందర్ రెడ్డి.
తాండూరు, జూన్ 11,(విజయక్రాంతి): అన్ని మౌలిక సదుపాయాలకు కూడిన నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే అందిస్తున్నామని..మీ పిల్లల్ని మా పాఠశాలల్లోనే చేర్పించాలి అంటూ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పి ఏం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు దేవరీ నరేందర్ రెడ్డి గురువారం మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న వివరాలను వివరిస్తూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధనుంజయ్ సిందే, జయశ్రీ, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.






