30 July, 2026 | 1:39 PM

ఉప్పొంగుతున్న గోదావరి.. తుమ్మిడిహెట్టి వద్ద జలకళ

30-07-2026 12:45 PM

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో  ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ జలకళను సంతరించుకుంది.వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.గోదావరి నది ఒడ్డుకు ఎవరూ వెళ్లరాదని, వరద నీటిని చూసేందుకు లేదా సెల్ఫీలు తీసేందుకు ప్రయత్నించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నది సమీపంలోని ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.