ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటతో ఇంటింటికీ విద్యా చైతన్యం
నేరేడుచర్ల, జూన్ 11(విజయక్రాంతి): ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల ప్రధానోపాధ్యాయులు బట్టు.మధు నేతృత్వంలో ఉపాధ్యాయ బృందం పురపాలక పరిధిలోని ఇంటింటి ప్రచారoలో, పాఠశాల కరపత్రాలను పంపిణీ చేస్తూ తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న విద్యా అవకాశాలు, సౌకర్యాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ వసతులు,సదుపాయాలను సద్వినియోగం చేసుకునేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వాసా జ్యోతి, లయన్స్ క్లబ్ సభ్యులు చిత్రం.విశ్వనాధ్, ఉపాధ్యాయులు ఎం. సైదులు ఎం జానకి రాములు ఎన్ నరసింహారావు వై జానయ్య పోలిశెట్టి శ్రీధర్ లాల్ సాహెబ్ పి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.






